Home > జాతీయం > GST : మార్చి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. వారికి మరింత కష్టం

GST : మార్చి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. వారికి మరింత కష్టం

GST : మార్చి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. వారికి మరింత కష్టం
X

మార్చి 1 2024 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్ అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 5కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు చేయలేరు. మార్చి 1 నుంచి వ్యాపారుల అన్ని లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు చిన్ని వ్యాపారులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసేవారిపై దీని ప్రభావం ఉంటుంది. జీఎస్టీ పన్ను విధానం ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు వ్యాపారులు ఇ-వే బిల్లును నిర్వహించడం తప్పనిసరి.

ఎన్ఐసీ (కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రం) తాజాగా ఈ నివేదికను ప్రకటించింది. చాలామంది వ్యాపారులు B2B, B2E ట్యాక్స్ చెల్లించేవారితో ఇ- ఇన్‌వాయిస్‌లతో లింక్ చేయకుండా ఇ-వే బిల్లుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అయితే వీరంతా ఇ-చలాన్ కు అర్హులే. వ్యాపారులంతా ఇ-చలాన్ బిల్లును ఎగ్గొట్టేసరికి స్టేట్మెంట్ ల మధ్య పొంతన ఉండటం లేదు. ఈ కారణంగా ఇ-చలాన్ స్టేట్మెంట్ లేకుండా.. ఇ-వే బిల్లును రూపొందించొద్దని సూచించింది.

Updated : 28 Feb 2024 3:29 PM IST
Tags:    
Next Story
Share it
Top