Home > జాతీయం > పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
X

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా టైంలో తీసుకున్న జాగ్రత్తలను మరోసారి పాటించాలని.. అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. కరోనా టెస్టుల కోసం ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలనని, టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. జిల్లాల్లోని కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి కోరింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ప్రయోగశాలలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా, ఇటీవల కరోనా సబ్ వేరియంట్ JN.1 కేరళలో బయటపడిన విషయం తెలిసిందే. రానున్న పండగల సీజన్‌లో వైరస్‌ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 335 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5 మరణాలు సంభవించాయి. ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా, ఉత్తర్ ప్రదేశ్ లో ఒకరు చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉంది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,33,317కు చేరింది. JN.1 వేరియంట్ దేశంలో తొలిసారి కేరళలో బయటపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో మొదట JN.1 వేరియంట్ ను గుర్తించగా.. ప్రస్తుతం 38 దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్ వల్లే మరోసారి కేసులు పెరుగుతున్నాయి. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య శాఖ తెలిపింది. వేరియంట్ సోకిన వక్తి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Updated : 18 Dec 2023 3:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top