అసలు మీది ఇండియానే కాదు..రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్
X
లోక్‌సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. కేంద్ర సర్కార్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల విషమై బీజేపీ సర్కార్ , ప్రధాని మోదీపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోదీ సర్కార్ భరతమాతను హత్య చేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ క్రమంలో రాహల్ కామెంట్స్‌పై సెంట్రల్ మినిస్టర్ స్మృతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు భారత దేశానికి చెందినవారే కారంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లోక్‌సభలో రాహుల్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుతగిలారు. రాహుల్ తప్పుగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..." మణిపూర్ భారతదేశంలో అంతర్భాగం. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరు. ముక్కలు చేయలేరు. రాహుల్ మణిపూర్ లో భరతమాతను చంపేశారన్నారు. దానికి ఆయన సపోర్టర్స్ బల్లలు బాదారు. మణిపూర్ ముఖ్యమంత్రితో నేను మాట్లాడాను. అక్కడ శాంతి నెలకొల్పాలని ముఖ్యమంత్రిని కోరాను. నిజానికి కుటుంబపాలనలోనే దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి. మీరనుకునే భారత దేశం కాదిది. అవినీతి రహిత భారత్. ఇక్కడ కుటుంబపాలనకు ఎలాంటి చోటు లేదు. అసలు మీరు భారత్‌కు చెందిన వారే కాదు. నాడు బ్రిటీష్ కు వ్యతిరేకంగా నినదించినట్లే ఇప్పుడు మీ అవినీతి పాలనకు స్వస్తి పలికేందుకు క్విట్ ఇండియా అంటూ స్లోగన్స్ చేయాలి.
కశ్మీర్లో ఓ పండిట్‌పై గ్యాంగ్ రేప్ చేసి ఆమెను క్రూరంగా హతమార్చారు. ఆ సంఘటనను సినిమాలో చూపిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారమన్నారు. ఇప్పుడు విచిత్రంగా వారే మాట్లాడుతున్నారు. రాజస్థాన్ లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ బాలికను నరికి చంపి ఇటుకబట్టిలో వేసి కాల్చేశారు. ఇప్పటికీ రాజ్జస్థాన్ లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవేవీ కాంగ్రెస్ కు మీకు కనిపించవా?" అంటూ స్మృతి ఇరానీ రాహుల్‌ను ప్రశ్నించారు.
#WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Bharat maa ki hatya ki baat karne wale kabhi bhi mez nahi thapthapate. Congressiyo ne baith kar maa ki hatya ke liye mez thapthapaai hai..." https://t.co/Nay92GDe4k pic.twitter.com/uAPE2YQIRN
— ANI (@ANI) August 9, 2023