Home > జాతీయం > జర్నలిస్టును బెదిరించిన స్మృతి ఇరానీ..వీడియో వైరల్

జర్నలిస్టును బెదిరించిన స్మృతి ఇరానీ..వీడియో వైరల్

జర్నలిస్టును బెదిరించిన స్మృతి ఇరానీ..వీడియో వైరల్
X

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ జర్నలిస్టుపై మండిపడ్డారు. ఆమెను ప్రశ్నించి కారణంగా చిరాకు పడ్డారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానపరుస్తున్నారంటూ ఆ జర్నలిస్ట్‌పై కస్సుబుస్సులాడారు. వీరిమధ్య జరిగిన వాడివేడి సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ కూడా షేర్ చేసి కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది.





స్మృతి ఇరానీ తన సొంత నియోజకవర్గం యూపీలోని అమేఠీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారంటూ..ఇలే చేస్తూ ఊరుకోనని బెదిరించారు. అయితే తనను ఎవర్నీ అవమానపర్చలేదని..కేవలం మీ చర్యలను మాత్రమే ప్రశ్నిస్తున్నానంటూ బదులిచ్చాడు. దీనికి మరింత ఆగ్రహించిన స్మృతి ఇరానీ.. . ‘‘నువ్వు పెద్ద రిపోర్టర్ అయివుండవచ్చు కానీ సామాన్య ప్రజలను అవమానించే హక్కు నీకు లేదు... నేను మీకు అత్యంత గౌరవం మరియు ప్రేమతో చెబుతున్నాను... నా ప్రజలను మళ్లీ అవమానించవద్దు. ఇంకోసారి ఇలా చేస్తే మీ పై అధికారికి కాల్‌ చేయాల్సి ఉంటుంది. వాళ్లే అన్నీ చూసుకుంటారు జాగ్రత్త..!’’ అని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.



స్మృతి ఇరానీపై తీరుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. సమాధానం చెప్పలేక బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ వీడియోనూ పోస్ట్ చేసింది. అయితే కాంగ్రెస్‌ విమర్శలకు స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చింది. . ‘‘అమేఠీ ప్రజలతో తప్పుగా ప్రవర్తించొద్దనే నేను చెప్పాను. అది అభ్యర్థన అని మీకు అర్థం కాకపోవచ్చు. అమేఠీ ప్రజలను అవమానిస్తే మీరు భరించగలరేమో గానీ.. నేను కాదు. అంటూ బదులిచ్చారు.


Updated : 10 Jun 2023 7:02 PM IST
Tags:    
Next Story
Share it
Top