Home > జాతీయం > ఫోన్ యూజర్లకు వార్నింగ్...ఆ నెంబర్లు లిఫ్ట్ చేయొద్దు...కేంద్ర మంత్రి

ఫోన్ యూజర్లకు వార్నింగ్...ఆ నెంబర్లు లిఫ్ట్ చేయొద్దు...కేంద్ర మంత్రి

ఫోన్ యూజర్లకు వార్నింగ్...ఆ నెంబర్లు లిఫ్ట్ చేయొద్దు...కేంద్ర మంత్రి
X

ఈ మధ్యకాలంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవడంతో సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయి. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‎ను లిఫ్ట్ చేసి చాలా మంది ప్రజలు తమ అకౌంట్లలోని సొమ్మును పోగొట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ కృషి చేస్తోంది. అన్‎నోన్ నంబర్ల నుంచి కాల్ వస్తే ఆ నెంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల స్పామ్‌ కాల్స్‌, సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‎లో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమాచారం అందించారు.

ఈ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...‘‘ అన్‎నోన్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. తెలిసిన నెంబర్లకు మాత్రమే సమాధానం ఇవ్వండి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా విజ్ఞప్తి . ఒకవేళ తెలియని నెంబర్ల నుంచి కాల్ వచ్చినప్పటికీ ముందుగా వారు ఎవరో తెలుసుకున్నాకే రెస్పాండ్ అవ్వాలి. టెలికాం మంత్రిత్వశాఖ ఈ మధ్య తీసుకొచ్చిన సంచార్‌ సాథి పోర్టల్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌, సైబర్‌ మోసాలకు అట్టుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నాము. 40 లక్షలకు పైగా సిమ్‌లు, 41 వేల అక్రమ ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’ ఏజెంట్లను గుర్తించి వారి నెంబర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతోంది".అని మంత్రి తెలిపారు.

Updated : 3 Jun 2023 7:33 AM IST
Tags:    
Next Story
Share it
Top