Home > జాతీయం > జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం.. మాజీ రాష్ట్రపతి సారథ్యంలో..

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం.. మాజీ రాష్ట్రపతి సారథ్యంలో..

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం.. మాజీ రాష్ట్రపతి సారథ్యంలో..
X

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో 16 మంది సభ్యులతో కమిటీని వేశారు. సభ్యుల పేర్లను రేపోమాపో ప్రకటించనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమిటీని నియమించడం గమనార్హం. ఈ సమేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెడతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదు.





జమిలి ఎన్నికల అంశాన్ని లా కమిషన్ పరిశీలిస్తున్న నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీకి స్వపక్ష నేతే సారథ్యం వహిస్తుండడంతో నివేదిక జమిలి ఎన్నికలకు అనుకూలంగానే వస్తుందని భావిస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలు జరగనుండడంత జమిలి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఖర్చు తగ్గింపు కోసం, సుస్థిర పాలన కోసం అంటూ మోదీ ప్రభుత్వం ఒక ఎన్నికల ప్రాధాన్యం గురించి కొన్నేళ్లుగా చెబుతోంది. అయితే దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం కష్టంగా మారడంతో పార్లమెంటు సమావేశాల్లో బిల్లు సహా కీలక పరిణామాలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు.


Updated : 1 Sept 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top