Home > జాతీయం > ఏపీతో సహా ఆ రాష్ట్రాల నుంచి టమాటాలు సేకరించండి : కేంద్రం

ఏపీతో సహా ఆ రాష్ట్రాల నుంచి టమాటాలు సేకరించండి : కేంద్రం

ఏపీతో సహా ఆ రాష్ట్రాల నుంచి టమాటాలు సేకరించండి : కేంద్రం
X

దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ ధరలు వింటేనే ప్రజల గుండెలు అదురుతున్నాయి. కేజీ టమాటా ధర కొన్ని చోట్లా 200 రూపాయలకు పైగా పలుకుతోంది. గతంలో కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకా చాలామంది టమాటాలు కొనేందుకే వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ప్రధాన మార్కెట్లలో విక్రయించేందుకు టమాటాలను సేకరించాలని NAFED,NCCFలను కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వీటిని సేకరించాలని సూచించింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని ప్రజలకు జులై 14 నుంచి రాయితీ ధరకు టమాటాలను పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరించింది.

ఢిల్లీకి హిమాచల్‌తోపాటు కర్ణాటక నుంచి టమాటాలు అధికంగా వస్తాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి టమాటాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలోని మదనపల్లె నుంచి కూడా టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్రలోని, నారాయణ్‌గావ్‌, ఔరంగాబాద్‌ తోపాటు మధ్యప్రదేశ్‌ నుంచి త్వరలోనే అదనపు పంట రానుంది. దీంతో టమాటాల ధరలు దిగొచ్చే అవకాశం ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారుల శాఖ అంచనా వేస్తోంది.

కాగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ మీద టమాటాలను విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట దిగుబడి, సరకు రవాణాలో అంతరాయం ఏర్పడడంతో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరాయి.


Updated : 12 July 2023 12:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top