Home > జాతీయం > జమిలి ఎన్నికలు పక్కా.. ఇప్పుడు కాకపోతే 2024లో... ఈ సమావేశాల్లోనే డిబేట్..

జమిలి ఎన్నికలు పక్కా.. ఇప్పుడు కాకపోతే 2024లో... ఈ సమావేశాల్లోనే డిబేట్..

జమిలి ఎన్నికలు పక్కా.. ఇప్పుడు కాకపోతే 2024లో... ఈ సమావేశాల్లోనే డిబేట్..
X

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా దూకుడు పెంచింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన ప్రభుత్వం శుక్రవారం ఆగమేఘాల మీద కమిటీ వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ నెల 17లోపు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ అధికరణను సవరిస్తారని వార్తలు వస్తున్నాయి.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వీటికి బలం చేకూర్చే వ్యాఖ్యలు చేశారు. ‘‘కమిటీ వేశాం. నివేదిక వచ్చాక చర్చిస్తాం. మన పార్లమెంటు పరిణతి చెందినది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. దీనిపై ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఒక మార్పు వస్తుంది. సమావేశాల్లో అజెండాపై చర్చిస్తాం’’ అని అన్నారు. సవరణ బిల్లులను కేవలం ఐదు రోజుల సమావేశాల్లో ఆమోదించడం కుదిరే పని కాదని, మోదీ ఓ ప్రయత్నంలో భాగంగా ఈ అంశాన్ని చట్టసభ ముందుకు తీసుకొస్తున్నారని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు కాకపోయినా షెడ్యూలు ప్రకారం 2024లో జరిగే ఎన్నికల నాటికైనా అన్ని అడ్డంకులను అధిగమించి జమిలికి మార్గం సుగమం చెయ్యాలన్నది మోదీ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ దిశగా దేశాన్ని, రాజకీయాలను సిద్ధం చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.




జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదని బీజేపీ నేతలు చరిత్రను గుర్తు చేస్తున్నారు. 1967 వరకు దాకా పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలోనే నిర్వహించేవారు. 1960 దశకం చివరల్లో కాంగ్రెస్ పాలిటిక్స్ మార్క్ వల్ల కొన్ని అసెంబ్లీను రద్దు చేశాక అవి గాడి తప్పాయి. 1971లో లోక్ సభకు తొలిసారి ముందస్తు ఎన్నికలు జరిపారు. తర్వాత పాలు పార్టీలు చీలిపోవడం, ఆయారాం గయారాంల సంస్కృతి పెరగడం, అసెంబ్లీలను రద్దు చేసుకునే అవకాశం పార్టీలకు ఉండడంతో జమిలి ఎన్నికలు సాధ్యం కాలేదు.


Updated : 1 Sept 2023 2:21 PM IST
Tags:    
Next Story
Share it
Top