Mahua Moitra : బంగ్లాను ఖాళీ చేయండి... మహువా వరుస షాకులు
X
తృణమూల్ నేత మహువా మొయిత్రాను కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌కు గురై నెల రోజులు గడిచినా టీఎంసీ ఎంపీ బంగ్లాను ఖాళీ చేయకపోవడం గృహనిర్మాణ, మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చినా.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ జనవరి 16న తమ ముందు హాజరు కావాలని కోరింది. మహువా సస్పెన్షన్ గురైన వెంటనే బంగ్లాను ఖాళీ చేయమని జనవరి 8నే DOE మహువాకు నోటీసు జారీ చేసింది. తనపై వేసిన అనర్హత వేటు కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండడంతో ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నారు.
తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులపై డిల్లీ కోర్టులో సవాలు చేసింది మహువా . దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వ నివాసంలో నివసించేందుకు ఎస్టేట్ డైరెక్టరేట్‌ను సంప్రదించాల్సిందిగా కోరింది. అక్కడే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని వివరించింది. నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం తర్వాత కూడా ప్రభుత్వ వసతి గృహాల్లో నివాసం ఉండేందుకు అనుమతించవచ్చని జస్టిస్ సుబ్రమణియన్ ప్రసాద్ వెల్లడించారు..