Home > జాతీయం > Z Category Security: కేంద్రం కీలక నిర్ణయం.. జై శంకర్కు భద్రత పెంపు..

Z Category Security: కేంద్రం కీలక నిర్ణయం.. జై శంకర్కు భద్రత పెంపు..

Z Category Security: కేంద్రం కీలక నిర్ణయం.. జై శంకర్కు భద్రత పెంపు..
X

విదేశాంగ మంత్రి జైశంకర్ కు కేంద్రం భద్రత పెంచింది. ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆయనకు వై కేటగిరి భద్రత ఉండేది.. ఇందులోభాగంగా ఢిల్లీ పోలీసులు ఆయన భద్రతను చూస్తుంది. ఇక నుంచి ఆ బాధ్యతలను సీఆర్పీఎఫ్ తీసుకోనుంది. ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంంలో కేంద్రం భద్రతను అప్గ్రేడ్ చేసింది.

ఇటీవల కాలంలో పలు ఉగ్రసంస్థల నుంచి ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి జైశంకర్కి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం భద్రతను పెంచింది. సీఆర్పీఎఫ్‌కు చెందిన 14 - 15 మంది సాయుధ కమాండోలు షిఫ్టుల వారీగా 24గంటల భద్రత కల్పిస్తారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా 176 మంది ప్రముఖులు ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ వీఐపీ సెక్యూరిటీ భద్రత కేటగిరీలో ఉన్నారు.

Updated : 12 Oct 2023 10:49 PM IST
Tags:    
Next Story
Share it
Top