Paper Leak : పోలీస్ క్వశ్చన్ పేపర్ లీక్ కలకలం.. బోర్డు చైర్‌పర్సన్‌పై వేటు
X
పోలీస్ క్వశ్చన్ లీక్ కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లో పోలీస్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు వస్తున్న వేళ.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్ పర్సన్ రేణుకా మిశ్రాను తొలగించింది. రేణుకా స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ కృష్ణను నియమించింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో కొన్ని రోజుల క్రితం.. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రద్దైంది. ఈ నేపథ్యంలో ఛైర్‌పర్సన్‌ను పదవి నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన ఈ ఎగ్జామ్ కు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పేపర్ లీక్ అయిందని ఆరోపణలు రావడంతో ఫిబ్రవరి 24న ప్రభుత్వం పోలీస్ ఎగ్జామ్ ను రద్దు చేసింది. ఆరు నెలల్లో తిరిగి నిర్వహిస్తామని ఈ మేరకు ప్రకటించింది. అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో దర్యాప్తు చేయిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఈ నేరంలో భాగంమైన వాళ్లందరికీ కఠినశిక్ష పడుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.