Home > జాతీయం > ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమాటాలు ఉచితం

ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమాటాలు ఉచితం

ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమాటాలు ఉచితం
X

టమాటా ధరలను ఆకాశాన్ని అంటడం కాదు కానీ...ఈ అవకాశాన్ని చాలామంది తనమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొబైల్ కొంటే టమాలు ఉచితం, బర్త్ డేకి టమాటాలు గిఫ్ట్ ఇలా రకరకాల వింతలు పోతున్నారు. ఇప్పుడు తాజాగా తన ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తాను అంటున్నాడు చంఢీఘడ్ లో ఓ డ్రైవర్.

పంజాబ్ లోని చంఢీఘడ్ లో అనీల్ కుమార్ అనే అతను 12 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా టమాటాల ధరలు విపరీతంగా పెరగడంతో...ఏదో ఒక సహాయం చేయాలని అనుకున్నారు. ధరలు విపరీతంగా పెరగడం వలన చాలా మంది వాటిని కొనుక్కోవడమే మానేస్తున్నారు. మరికొందరు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వ దుకాణాల దగ్గర క్యూలు కడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు అనీల్. తన ఆటోలో ట్రావెల్ చేస్తే టమాటాలు ఉచితంగా ఇస్తానని ఆటో వెనుక పోస్టర్ అంటించారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ పెట్టారు. ఆటోలో కనీసం 5సార్లు ప్రయాణించాలని షరతు పెట్టారు.

అనిల్ ఆటో వెనుక పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. తనకున్న ఏకైక ఆదాయ మార్గం ఆటోనే. అందుకే దాని ద్వారానే ఇలాంటి సేవలను అందించాలని అనుకున్నాను అంటున్నారు అనిల్. ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని కూడా చెబుతున్నారు. అంతేకాదు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద భారత్ విజయం సాధిస్తే ఐదురోజుల పాటూ ఫ్రీగా ఆటో తిప్పుతున్నాని చెబుతున్నారు.

గతంలో కూడా అనిల్ కుమార్ ఇలాంటివి చాలానే చేశారు. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ సక్సె చేసినప్పుడు కొద్దిరోజుల పాటూ ఉచిత ప్రయాణాన్ని అందించారు. అంతేకాకుండా తన ఆటోలో గర్భిణీలకు, ప్రమాద బాధితులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నందుకు చండీగఢ్‌ పోలీసుల నుంచి సత్కారం కూడా అందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటోలో భారత సైనికులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాడు.



Updated : 19 July 2023 9:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top