Home > జాతీయం > చంద్రయాన్-3 భారత్ కలల్ని నిజం చేయాలి.. ప్రధాని మోడీ

చంద్రయాన్-3 భారత్ కలల్ని నిజం చేయాలి.. ప్రధాని మోడీ

చంద్రయాన్-3 భారత్ కలల్ని నిజం చేయాలి.. ప్రధాని మోడీ
X

నెల్లూరూ జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ నుండి మరి కొన్ని నిమిషాల్లో చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇస్రో ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్​– 3 ని విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 14న చంద్రయాన్​‌‌ – 3 ప్రయోగం సందర్భంగా ఆయన ట్వీట్​ చేశారు. 'అంతరిక్ష రంగంలో జులై 14, 2023 చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి చంద్రయాన్​ 3 ప్రయాణం మొదలు కానుంది. కోట్ల మంది ప్రజల ఆశల్ని ఈ రాకెట్​ నింగిలోకి తీసుకువెళ్తుంది.' అని ప్రధాని ట్వీట్​లో పేర్కొన్నారు. భవిష్యత్తులో చంద్రుడిని ఆవాసయోగ్యంగా మార్చుకోవచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా చంద్రయాన్ 3 పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో ఎంతో కీలకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెక్ అవ్వాలని కోరుకున్నారు. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా మరోసారి భారత్ చంద్రుడిపై అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ రోజు భారతదేశానికి ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు. ఇస్రో సైంటిస్ట్‌లకు, సహయక బృందానికి, దేశ ప్రజలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తామని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం చుట్టుపక్కల కోలాహలం నెలకొంది. విద్యార్థులు మరికొద్దిసేపట్లో నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరనున్న lmv-3 రాకెట్ ని వీక్షించేందుకు జనం బారులు తీరుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గణ్​, అనుపమ్ ఖేర్ తదితరులు శాస్ర్తవేత్తల బృందానికి గుడ్​లక్​ చెప్పారు.


Updated : 14 July 2023 2:52 PM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top