Home > జాతీయం > చంద్రయాన్ 3 సక్సెస్.. ప్రకాష్ రాజ్‌కి చుక్కలు చూపిస్తున్న నెటిజన్స్

చంద్రయాన్ 3 సక్సెస్.. ప్రకాష్ రాజ్‌కి చుక్కలు చూపిస్తున్న నెటిజన్స్

చంద్రయాన్ 3 సక్సెస్.. ప్రకాష్ రాజ్‌కి చుక్కలు చూపిస్తున్న నెటిజన్స్
X

విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు. సౌత్ సహా అనేక భాషల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి నెగిటివ్ రోల్స్ తో పాటు, కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ తరచుగా చేసే రాజకీయ వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లోకి నెడుతుంటాయి. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ వెనుదిరగకుండా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేయడం తెలిసిందే. మూన్ నుంచి ఫస్ట్ పిక్చర్స్ అంటూ ప్రకాష్ రాజ్ కొన్ని వివాదాస్పద పోస్ట్ లు చేశాడు.





తాజాగా చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో నెటిజన్లు అతడికి చుక్కలు చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫోటో ఇదే అంటూ ప్రకాష్ రాజ్ బురదలో 'ఒక్కడు' సినిమాలోని సీన్ ను పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు అయితే విక్రమ్ ల్యాండర్, రోవర్ చంద్రుడిపై నీటిని గుర్తించాయి. ఆ బురదలో ప్రకాష్ రాజ్ కనిపించారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా వరుసగా ప్రకాష్ రాజ్ పై మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే చంద్రయాన్ 3 ని కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్ట్ కి గాను అతడిపై కేసు కూడా నమోదు చేశారు.










Updated : 24 Aug 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top