Home > జాతీయం > ఆగస్టు 23ను జాతీయ అంతరిక్షదినోత్సవంగా జరుపుకుందాం - ప్రధాని మోడీ

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్షదినోత్సవంగా జరుపుకుందాం - ప్రధాని మోడీ

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్షదినోత్సవంగా జరుపుకుందాం - ప్రధాని మోడీ
X

చంద్రయాన్ - 3 ద్వారా అసాధారణ విజయం సొంతం చేసుకున్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇందుకు కృషి చేసిన ఇస్రో సైంటిస్టులకు సెల్యూట్ చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్న ప్రధాని మోడీ మూన్ మిషన్ సక్సెస్ చేసిన ఇస్రో సైంటిస్టులను కలిసేందుకు వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో సెంటర్ కు వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చంద్రయాన్ - 3 ప్రయోగం జరిగిన తీరును మోడీకి వివరించారు.





శివ శక్తి పేరు

అనంతరం మాట్లాడిన ప్రధాని ‘జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌’ నినాదంతో ప్రసంగం మొదలుపెట్టారు. ఇస్రో సాధించిన విజయం గర్వకారణమన్న ఆయన.. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సౌతాఫ్రికాలో ఉన్నా తన మనసంతా చంద్రయాన్ - 3 విజయంపైనే ఉందని చెప్పారు. ఇందుకు కృషి చేస్తున్న సైంటిస్టులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. భారత్ చంద్రుడిపై అడుగుపెట్టడం అసాధారణ విజయమన్న మోడీ.. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. గతంలో ఎవరూ సాధించని ఘనతను ఇస్రో సాధించిందని, చంద్రయాన్ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందామని అన్నారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం

చంద్రయాన్‌ - 3 సక్సెక్స్ కు కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలు ప్రధాని ప్రశంసించారు. మన నారీ శక్తి సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటామని అన్నారు. ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందామని ప్రకటించారు. అంతరిక్ష విజ్ఞానం వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఉపయోగపడాలని,వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.




Updated : 26 Aug 2023 9:34 AM IST
Tags:    
Next Story
Share it
Top