Home > జాతీయం > Election Schedule : ముందస్తు ఎన్నికల రూమర్స్కు చెక్..షెడ్యూల్ అప్పుడే!

Election Schedule : ముందస్తు ఎన్నికల రూమర్స్కు చెక్..షెడ్యూల్ అప్పుడే!

Election Schedule : ముందస్తు ఎన్నికల రూమర్స్కు చెక్..షెడ్యూల్ అప్పుడే!
X

దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే జరుగుతాయనే ఊహాగానాలను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. దీంతో మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. అయితే ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆ రూమర్లను ఖండించింది.

ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ ఈ మధ్య రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఉహగానాలకు సీఈసీ చెక్ పెట్టింది. గతంలో లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఎన్నికల కోసం ఇప్పటి వరకు కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన సాగింది. అనంతరం ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఒడిశాలో ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఆ తరువాత బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లలో పర్యటన చేయనుంది. కాగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉంటుందని సమాచారం.




Updated : 10 Feb 2024 1:22 PM IST
Tags:    
Next Story
Share it
Top