Home > జాతీయం > Bomb Threat: నిన్న బెంగుళూరు, ఇవాళ చెన్నై.. ఈ-మెయిళ్లతో బెదిరింపులు

Bomb Threat: నిన్న బెంగుళూరు, ఇవాళ చెన్నై.. ఈ-మెయిళ్లతో బెదిరింపులు

Bomb Threat: నిన్న బెంగుళూరు, ఇవాళ చెన్నై.. ఈ-మెయిళ్లతో బెదిరింపులు
X

ఇటీవల దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉన్నాం. రైల్వే స్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాలు, జనాలు రద్దీగా ఉండే కేఫ్‌లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు-కాలేజీలకు బెదిరింపు కాల్స్(Bomb Threat)వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమాచారంతో రంగంలోకి దిగుతున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్, డాగ్స్ తో ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాంబులు ఉంటే వెతికి తీస్తున్నారు. లేకుంటే.. అలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారి తాట తీస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా చెన్నైలోని పలు స్కూళ్ల (Schools)కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. చెన్నై నగరంలోని 5 పాఠశాలలకు ఈరోజు(Thursday) బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా స్కూల్‌ యాజమాన్యాలు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపించారు. ఇవాళ, రేపు సెలవులు ప్రకటించి స్కూళ్లను మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆర్‌ఏ పురం, గోపాలపురం, అన్నానగర్‌, జేజేనగర్‌, పరిముణా ప్రాంతాల్లోని 5 పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయా స్కూళ్లలో బాంబు స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్ లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ఈ-మెయిల్‌ పంపిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రెండు నెలల క్రితం బెంగుళూరు(bengaluru)లో కూడా అచ్చం ఇలాగే ఒకే రోజు 60 కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ వచ్చాయి. వెంటనే స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించగా... రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టి... అనుమానించదగ్గ వస్తువులు ఆయా పాఠశాలల్లో లేవని చెప్పారు. ఇదంతా ఫేక్ అని నిర్ధారించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మెయిల్స్ ఆధారంగా నిందితున్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కానీ ఇంకా ఆ నిందితులెవరో తెలియలేదు.




Updated : 8 Feb 2024 2:43 PM IST
Tags:    
Next Story
Share it
Top