Chhattisgarh Assembly polls: పోలింగ్ రోజున ఛత్తీస్‌గఢ్‌లో IED పేలుడు.. తీవ్రగాయాలు
X
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్ని నిషేధించిన మావోయిస్టులు.. హింసకు పాల్పడుతున్నారు. సుక్మా జిల్లాలో IED బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్‌కి గాయాలయ్యాయి. సుక్మా సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. సుక్మాలోని తొండమార్క ప్రాంతంలో నక్సల్స్ పెట్టిన IED బాంబు పేలి CRPF కోబ్రా 206 బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనతో సెక్యూరిటీ అలర్ట్ పెరిగింది. మిగతా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికలు ప్రారంభమైన గంటకే మావోయిస్టులు ఈ పేలుడుకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా.. తొలి దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరంలో మొత్తం 40 స్థానాలకూ ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.
అసెంబ్లీ పోలింగ్ కు ముందురోజు కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో బాంబు పేలుడు ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలయ్యాయి. గాయపడిన BSF కానిస్టేబుల్ ప్రకాష్ చంద్‌ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు పోలింగ్ అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కాంకేర్ జిల్లాలోని మార్బెడ నుండి రెంగాఘటి రెంగగొండి పోలింగ్ స్టేషన్‌కు వెళుతుండగా పేలుడు సంభవించింది.