Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ తగ్గుదల
X
నాన్ వెజ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి. గతకొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. కార్తీక మాసం కావడంతో జనాలు చికెన్ జోలికి వెళ్లకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 170గా ఉంది. తాజాగా మరో రూ. 20 తగ్గి.. స్కిన్ లెస్ ధర రూ. 145 ఉండగా, డ్రెస్సుడ్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 128 గా ఉంది. ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.
మార్కెట్‌లో చికెన్ వినియోగం తక్కువగా ఉండడంతో చాలావరకు కోళ్లన్ని షాపుల్లోనూ, పౌల్ట్రీ ఫామ్‌కే పరిమితమయ్యాయి. దీంతో బయట చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువ.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది