చిన్నారి తలను ఈడ్చుకెళ్లిన కుక్కలు.. అది చూసిన గ్రామస్థులు
X
వ్యూహం సినిమా విడుదలకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచే వివాదాలు కొనసాగుతున్నాయి. థియేటర్లలో ఈ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లను కించపరిచేలా ఉందంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై ఈ నెల 22న తీర్పు ఇవ్వనుంది. అప్పటివరకు సినిమా రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో వ్యూహం సినిమాను ఓటీటీ, ఇంటర్నెట్ వేదికల్లోనూ రిలీజ్ చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. నారా లోకేష్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
గత నెల 29న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లను కించపరిచేలా ఉందంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. సినిమా రిలీజ్ ఆగిపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సింగిల్ బెంచ్కు డివిజన్ బెంచ్ కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్తో పాటు రికార్డును పరిశీలించిన న్యాయస్థానం.. ఈ నెల 22న తుది తీర్పు ఇవ్వనుంది.