CJI DY Chandrachud : అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అనుసరించండి..! సీజేఐ పిలుపు
X
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన సూచించిన విలువలు కేవలం జడ్జిలు, లాయర్లకు మాత్రమే కాదన్నారు. బాబాసాహెబ్ వర్ధంతి(డిసెంబర్ 6) రోజుని పురస్కరించుకొని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇతర సుప్రీం కోర్టు జడ్జిలతో కలిసి ఈ ఉదయం బాబా సాహెబ్ కు ఘన నివాళులర్పించారు.
అనంతరం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చంద్రచూడ్....ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. రాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన రోజు అని కొనియాడారు. 75 ఏళ్ల క్రితం నాటి ప్రాధమిక సూత్రాలను న్యాయ వ్యవస్థ నేటికి అనుసరిస్తున్నందున ఈ రోజు చాలా గొప్ప రోజు అన్నారు. ఈ ఏడాది నవంబర్ 26 న సుప్రీంకోర్టు ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించడంతో అంబేద్కర్ తమలో నే ఉన్నట్టుంగా ఉందన్నారు.
1891 ఏప్రిల్ 1న జన్మించిన భారత న్యాయ కోవిదుడు, ఆర్ధికవేత్త, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 వ తేదీన కన్నుమూశారు. ఇదే రోజును దేశమంతా ‘మహాపరినిర్వాణ్’ దినం గా పాటిస్తారు. కాగా ఈరోజు 67వ మహాపరినిర్వాణ్ దినం.