మణిపూర్ అల్లర్ల వెనక విదేశీ కుట్ర.. సీఎం… అటు మయన్మార్‌లో
X
జాతుల సమరంలో అట్టుడుతుకుతున్న మణిపూర్‌లో పరిస్థితి కాస్త అదుపులోకి వస్తోంది. చెదురుమదురు ఘర్షణలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగడం లేదని బలగాలు చెబుతున్నాయి. మరోపక్క.. మెయిటీ, కుకీ తెగల మధ్య రేగిన అల్లర్లకు విదేశీ హస్తమే కారణమై ఉండొచ్చని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఇంత హింస జరిగిందంటే ముందస్తు పథకంతోనే అల్లర్లకు పాల్పడి ఉంటారు. మా రాష్ట్రం దేశ సరిహద్దులో ఉండడంతో విదేశీ కుట్రలు ఉండొచ్చు. మయన్మార్ మా పక్కనే ఉంది. చైనా 398 కి.మీ. దూరంలో ఉంది. మణిపూర్ సరిహద్దులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సైనికుల ఉన్నా ప్రతి అంగుళాన్ని తనిఖీ చేయడం అసాధ్యం,’’ అని ఆయన అన్నారు. అల్లర్లో ఏ అనుమానాన్నీ తోసిపుచ్చమని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాధితులకు పరామర్శ పేరుతో రాజకీయ లబ్ధి కోస ప్రయత్నిస్తున్నారని బీరేన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు స్వార్థపూరిత అజెండాతోనే తమ రాష్ట్రంలో తిరుగుతున్నారని మండిపడ్డారు. మరోపక్క.. కుజూమా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన అల్లర్లలో ముగ్గురు మెయిటీలను కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. మెయిటీ ప్రకారంతో డుంప్‌కీ కుకీ గ్రామాన్ని తగలబెట్టారు.
మయన్మార్ నేతలతో చర్చలు..
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో భారత రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే.. రెండు రోజుల పర్యటన కోసం మయన్మార్ వెళ్లారు. సరిహద్దు వివాదాలు, డ్రగ్స్ సరఫరాల, నేర నిరోధం తదితర అంశాలపై ఆ దేశ నాయకత్వంతో చర్చలు జరిపారు. భారత భద్రతకు తలెత్తుతున్న ముప్పు గురించి ఆ దేశా నాయకుతో చర్చించినట్లు రక్షణ శాఖ తెలిపింది. భారత్ మయన్మార్‌తో 1700 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. మణిపూర్ అల్లర్లు మొదలైనప్పుడు భారత సైన్యం సరిహద్దులో గట్టి కాపలా కాస్తోంది.