Home > జాతీయం > మణిపుర్ దాడిలో.. విదేశీ సైనికుల హస్తం: సీఎం బీరెన్ సింగ్

మణిపుర్ దాడిలో.. విదేశీ సైనికుల హస్తం: సీఎం బీరెన్ సింగ్

మణిపుర్ దాడిలో.. విదేశీ సైనికుల హస్తం: సీఎం బీరెన్ సింగ్
X

మణిపుర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే నగరంలో.. మిలిటెంట్లు భద్రతాబలగాలపై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమాండోలు, ఓ బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న బాధితులను మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దాడిలో విదేశీ కిరాయి సైనికులు పాల్గొన్నారని అన్నారు. ఆ సైనికులు ఆధునిక ఆయుధాలు వాడినట్లు తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు అదనపు బలగాలను తరలించి.. కూబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఇలాంటి ఉగ్ర కార్యకాలాపాలను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. థౌబాల్ జిల్లాలోని పౌరులపై దుండగులు కాల్పులు జరిపిన తర్వాత రోజే.. భద్రతాదళాలపై మిలిటెంట్లు దాడి చేయడం గమనార్హం. భద్రతా బలగాలను పోలిన దుస్తులను ధరించి.. సోమవారం థౌబాల్ లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 2 Jan 2024 12:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top