Home > జాతీయం > ఈడీ అధికారులపై సీఎం హేమంత్ సోరెన్ ఫిర్యాదు

ఈడీ అధికారులపై సీఎం హేమంత్ సోరెన్ ఫిర్యాదు

ఈడీ అధికారులపై సీఎం హేమంత్ సోరెన్ ఫిర్యాదు
X

జార్ఖండ్‌‌లో ఈడీ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఫిర్యాదుతో ఈడీ ఆఫీసర్స్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిట్లు పోలీసులు వెల్లడించారు. అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సీఎం ధృవా పోలీసు స్టేషన్‌లో సీఎం సోరెన్‌ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు వెల్లడించారు. మనీలాండరింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న సీఎం హేమంత్‌ సోరెన్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నేడు విచారించిన విషయం తెలిసిందే. భారీ భద్రత నడుమ రాంచీలోని సోరెన్‌ నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు.. సోరెన్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ.. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో సోరెన్‌ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated : 31 Jan 2024 5:15 PM IST
Tags:    
Next Story
Share it
Top