తమిళనాడు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే
X
తమిళనాట 39 లోక్ సభ సీట్లకు గాను అధికార డీఎంకే పార్టీ 21 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. కీలక అభ్యర్థల్లో కనిమొళి తూత్తకుడి నుంచి, దయానిధి మారన్ చెన్త్నె సెంట్రల్ నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన సీట్లను ఇండియా కూటమికి కేటాయించనుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అటు అన్నాడీఎంకే కూడా 16 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. డీఎంకే నేతల సమక్షంలో సీఎం ఎంకే స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం వంటి వాగ్దానాలను అందులో ప్రస్తావించారు.
అలాగే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామని చెప్పారు. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన.. బీజేపీ పాలనలో దేశం వెనకబడింది. వారు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. 2024లో మన కూటమి అధికారంలోకి వస్తుంది’’ అని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రధాని మోదీ చేస్తోన్న పర్యటనలపై స్పందిస్తూ.. ‘‘వరదల సమయంలో మోదీ పర్యటిస్తే సంతోషించేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. 39 లోక్‌సభ స్థానాలకు గానూ 21 సీట్లకు డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన సీట్లను కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించే అవకాశాలున్నాయి.ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు తొలివిడత ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.