Home > జాతీయం > Rahul Gandhi: నోరుజారిన రాహుల్ గాంధీ.. నిజం ఒప్పుకున్నారంటూ బీజేపీ సటైర్లు

Rahul Gandhi: నోరుజారిన రాహుల్ గాంధీ.. నిజం ఒప్పుకున్నారంటూ బీజేపీ సటైర్లు

Rahul Gandhi: నోరుజారిన రాహుల్ గాంధీ.. నిజం ఒప్పుకున్నారంటూ బీజేపీ సటైర్లు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు జారారు. చత్తీస్ఘడ్ కబీర్ధామ్ లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన.. అదానీ కోసం పనిచేయాలని పొరపాటున సీఎం భూపేష్ భగేల్కు సూచించారు. ప్రసంగంలో భాగంగా బీజేపీ ధనవంతులకు కోసం సేవ చేస్తోందన్న రాహుల్.. అదానీ గ్రూపును ప్రస్తావించారు. బీజేపీ అదానీ గ్రూపుకు లబ్ది చేకూర్చేందుకు 24X7 సేవ చేస్తోందని విమర్శించారు. బీజేపీతో పాటు ఛత్తీస్ఘడ్ సీఎం కూడా అదానీ కోసం పనిచేస్తున్నారని, తాము మాత్రం పేదలు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పనిచేస్తున్నామని రాహుల్ గాంధీ నోరు జారారు.

రాహుల్ వ్యాఖ్యలతో వేదికపైనే ఉన్న సీఎం భూపేష్ బఘేల్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయారు. అయితే రాహుల్ కామెంట్లను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం అదానీ గ్రూప్‌ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ ఒప్పుకున్నారని సటైర్లు వేసింది. అదానీ వంటి పారిశ్రామికవేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు.

Updated : 29 Oct 2023 9:51 PM IST
Tags:    
Next Story
Share it
Top