Home > జాతీయం > ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
X

నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గుడ్ న్యూస్ చెప్పింది. 1764 ఉద్యోగ నియామకాలను చేపడుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలీకమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ అండ్‌ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఈ పోస్ట్ లకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో మెట్రిక్యులేషన్, డిప్లమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 నుంచి 7 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఈ పోస్ట్ లను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టులు:

పోస్టులు: ఎగ్జిక్యూటివ్ కేడర్

విభాగం: ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ అండ్‌ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్

అర్హత: గుర్తింపు కలిగిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్, డిప్లమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 3 నుంచి 7 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష

దరఖాస్తు ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 9, 2023

పూర్తి వివరాల కోసం: http://coalindia.in/




Updated : 12 Aug 2023 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top