Home > జాతీయం > ప్రకాష్ రాజ్కు ఘోర అవమానం.. విద్యార్థులు ఏం చేశారంటే..?

ప్రకాష్ రాజ్కు ఘోర అవమానం.. విద్యార్థులు ఏం చేశారంటే..?

ప్రకాష్ రాజ్కు ఘోర అవమానం.. విద్యార్థులు ఏం చేశారంటే..?
X

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో అంత పాపులర్ అయ్యారు. సినిమాలే కాకుండా అటు రాజకీయాల్లోనూ ఆయన యాక్టివ్గా ఉంటారు. మోదీ ప్రభుత్వంపై తనదైన విమర్శలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక బీజేపీ నేతలకు ప్రకాష్ రాజ్ అంటే కోపం నశాలానికి అంటుతుంది. ఎందుకంటే బీజేపీపై ఆయన కామెంట్లు అలా ఉంటాయి. ఈ క్రమంలో కర్నాటకలోని ఓ కాలేజీలో ఆయనకు ఘోర అవమానం జరిగింది.

కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని సర్ ఎంవి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీకి ప్రకాష్ రాజ్ వెళ్లారు. అక్కడ జరిగిన డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి విద్యార్థులను అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులని అనుమతించని కార్యక్రమం కాలేజీలో ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. . ప్రకాష్ రాజ్ ఇవేమి పట్టించుకోకుండా కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయారు.

ఇక విద్యార్థులకు ఏబీవీపీ నేతలు మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వెళ్లిపోయాక.. ఆయన కూర్చున్న స్థలం, ప్రసంగించిన ప్రాంతాన్ని కొందరు విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. గోమూత్రాన్ని నీటిలో ఆడిటోరం అంతా చల్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విద్యార్థుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, ఏబీవీపీ నేతలే విద్యార్థులతో అలా చేయించారని ఆరోపిస్తున్నారు.

Updated : 10 Aug 2023 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top