Home > జాతీయం > హరియాణాలో మతఘర్షణలు.. నలుగురి మృతి...

హరియాణాలో మతఘర్షణలు.. నలుగురి మృతి...

హరియాణాలో మతఘర్షణలు.. నలుగురి మృతి...
X

హరియాణాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురుగ్రామ్‌లోని నుహ్ జిల్లా మేహాత్ నుహ్ ప్రాంతంలో ఇరు మతాలవారి మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. కొన్నివాహనాలతోపాటు ఓ మసీదుకు నిప్పు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హింసలో నలుగురు చనిపోయారు. విశ్వహిందూ పరిషత్ సోమవారం నిర్వహించిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ను ఓ వర్గం అడ్డుకోవడంతో హింసం జరిగినట్లు తెలుస్తోంది. యాత్రపై రళ్లు రువ్వారని, మూడు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.

దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెక్టార్ 57లోని ఓ మసీదుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో ఓ యువకుడు చనిపోయాడు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసుల మోహరించింది. మంగవారం స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. నుహ్ జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కర్ఫ్యూ విధించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated : 1 Aug 2023 11:03 AM IST
Tags:    
Next Story
Share it
Top