Home > జాతీయం > Himachal Pradesh : బీజేపీ బడా ప్లాన్.. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫట్..!

Himachal Pradesh : బీజేపీ బడా ప్లాన్.. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫట్..!

Himachal Pradesh  : బీజేపీ బడా ప్లాన్.. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫట్..!
X

బీజేపీ మరో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. రాజ్యసభ ఎన్నికలు దీనికి వేదికగా మారింది. దీంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఈ పరిణామంతో సీఎం సుఖ్విందర్ సింగ్ సర్కార్ మైనార్టీలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు బలం లేదని.. సీఎం సుఖ్విందర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మనుసింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సింది గవర్నర్ను కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తంగా సాగుతోన్నాయి. ఒక్క సభ్యున్ని మద్ధతు కూడగట్టడం బీజేపీ పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ చెక్ పెడుతుందా అనేది వెయిట్ అండ్ సీ..



Updated : 28 Feb 2024 9:32 AM IST
Tags:    
Next Story
Share it
Top