Home > జాతీయం > జమిలి ఎన్నికలపై రాహుల్ గాంధీ డౌట్ ఏమంటే..

జమిలి ఎన్నికలపై రాహుల్ గాంధీ డౌట్ ఏమంటే..

జమిలి ఎన్నికలపై రాహుల్ గాంధీ డౌట్ ఏమంటే..
X

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల జరిపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాన విపక్షం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసింది. ఇది రాష్ట్రాల హక్కులపై దాడి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. జమిలి సాధ్యాసాధ్యాలను పరిశీలించానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.

‘‘కమిటీని ఇప్పుటికిప్పుడు ఏర్పాడు చేయడం, దాని విధివిధానాల చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే వచ్చేసినట్లు కనిపిస్తోంది. కమిటీ కూర్పుపైనా సందేహాలు ఉన్నాయి. అందుకే అందులో ఉండొద్దని మా పార్టీ నాయకుడు అధీర్ రంజన్ నిర్ణయించుకున్నారు. ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు అనడం దేశ ఐక్యతకు దెబ్బ. రాష్ట్రాలపై దాడి చేయడమే. కమిటినీ లాంఛనంగా వేశారు. దానిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి’’ అని అన్నారు. కమిటీ నుంచి అధీర్ తప్పుకోవడం సరైందేనని కాంగ్రెస్ మరో నేత జైరాం రమేశ్‌ అన్నారు.




త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని, జమిలి ఎన్నికలకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేస్తారని భావిస్తున్నారు.


Updated : 3 Sept 2023 3:56 PM IST
Tags:    
Next Story
Share it
Top