Home > జాతీయం > ఫైనల్ మ్యాచ్కు మోదీ.. కాంగ్రెస్ సెటైర్లు

ఫైనల్ మ్యాచ్కు మోదీ.. కాంగ్రెస్ సెటైర్లు

ఫైనల్ మ్యాచ్కు మోదీ.. కాంగ్రెస్ సెటైర్లు
X

అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మోదీపై సెటైర్లు వేస్తుంది. ప్రజా సమస్యలు పట్టించుకునేందుకు తీరికలేదు కానీ.. పనిగట్టుకుని మ్యాచ్ చూడటానికి టైం ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు. మణిపూర్ ఉద్రిక్తతలపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అక్కడి పరిస్థితులను చూసేందుకు ఒక్కసారి కూడా మణిపూర్ వెళ్లలేదని మోదీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ట్విట్టర్ ద్వారా విమర్శించారు. దీంతో మోదీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని సైటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. టీమిండియా ఓటమిని కూడా రాజకీయం చేయడం సరికాదంటున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ట్రోఫీ ప్రధానోత్సవానికి వెళ్తే తప్పేంటని మండిపడుతున్నార.





Updated : 20 Nov 2023 2:25 PM IST
Tags:    
Next Story
Share it
Top