Home > జాతీయం > విపక్షాల మీటింగ్.. కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం

విపక్షాల మీటింగ్.. కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం

విపక్షాల మీటింగ్.. కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం
X

వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న, ఇవాళ బెంగళూరులో ప్రత్యేక సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 24 పార్టీలు హాజరై బీజేపీని మట్టికరిపించే అంశాలపై మంతనాలు జరుపుతున్నాయి. విపక్షాల కూటమికి కొత్త ఇండియా అనే పేరును కూడా పెట్టారు.

ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి ఆసక్తి ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయని.. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం ఆ విభేధాలను వదిలిపెట్టవచ్చునని చెప్పారు.

ఈ సమావేశానికి హాజరైన 24 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని ఖర్గే చెప్పారు. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.


Updated : 18 July 2023 4:30 PM IST
Tags:    
Next Story
Share it
Top