Home > జాతీయం > Rahul Gandhi : రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. అమిత్ షాకు ఖర్గే లేఖ

Rahul Gandhi : రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. అమిత్ షాకు ఖర్గే లేఖ

Rahul Gandhi  : రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. అమిత్ షాకు ఖర్గే లేఖ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర అసోంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో పలు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడం, పార్టీ పోస్టర్లను చించడం,దాడికి పాల్పడడం వంటివి లేఖలో ప్రస్తావించినట్లు జైరాం రమేష్ తెలిపారు. అయినా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారని చెప్పారు.

మరోవైపు అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ‘‘హింసాత్మక ఘటనలు, ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని హిమంత ట్వీట్ చేశారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొనేవారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా.. పర్మిషన్ ఉన్న మార్గంలోనే వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గువాహటి సీపీ దిగంత బోరా వివరించారు. అయినా యాత్రలో పాల్గొన్న వారు నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లాలని నాయకులే ప్రోత్సహించడంతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో నలుగురు సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు.


Updated : 24 Jan 2024 5:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top