Home > జాతీయం > Sonia Gandhi : ఎజెండా ఏమిటో చెప్పండి..మోదీకి సోనియా గాంధీ లేఖ

Sonia Gandhi : ఎజెండా ఏమిటో చెప్పండి..మోదీకి సోనియా గాంధీ లేఖ

Sonia Gandhi : ఎజెండా ఏమిటో చెప్పండి..మోదీకి సోనియా గాంధీ లేఖ
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై క్లారిటీ ఇవ్వాలని ఆమె లేఖలో ప్రధానిని డిమాండ్ చేశారు. అంతే కాదు తమ ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె కోరారు.

ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు స్పెషల్ పార్లమెంట్ మీటింగ్స్‎ను నిర్వహించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అయితే ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఎజెండా ఏమిటో విపక్షాలకు తెలపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో తమ ఎజెండా ఏమిటో తెలపాలంటూ సోనియా గాంధీ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.





లేఖలో సోనియా..." ప్రతిపక్షాలతో చర్చించకుండానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ప్రకటించింది. పైగా తమ ఎజెండా ఎమిటో క్లారిటీగా చెప్పలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. అందుకే ఈ ప్రత్యేక సమావేశం ఎజెండా ఏంటో ఓ క్లారిటీ ఇవ్వండి. ప్రజా సమస్యలను లేవనెత్తడమే మా ప్రధాన లక్ష్యం. పార్లమెంట్‎లో ప్రజల సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం కేటాయించాలి. ముఖ్యంగా 9 అంశాలను కేంద్రం తమ ఎజెండాలో చేర్చాలి. అదానీ అక్రమాలు, మణిపుర్‌ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర , జనగణన, కేంద్రానికి, రాష్ట్ర సర్కార్లకు మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అందించే సహాయం, దేశంలో పలు ప్రాంతాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, బార్డర్స్‎లో కొనసాగుతున్న చైనా ఆక్రమణల అంశాలను ఎజెండాలో చేర్చాలి" అని సోనియా గాంధీ లేఖలో ప్రధానిని కోరారు.





Updated : 6 Sept 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top