Home > జాతీయం > భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల

భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల

భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల
X

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ మరో యాత్రకు సన్నద్ధమైంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేశారు. న్యాయం జరిగే వరకు అనే నినాదంతో రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది.

లోగో విడుదల అనంతరం మాట్లాడిన ఖర్గే పార్లమెంట్‌లో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని, అందుకే తాము న్యాయ యాత్ర చేపడుతున్నామని ఖర్గే అన్నారు. మణిపూర్‌లో జరిగిన దురదృష్టకర ఘటనల గురించి ప్రధాని మోడీ చాలాసార్లు ప్రసంగించారే తప్ప ఆ రాష్ట్రానికి మాత్రం వెళ్లలేదని విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘనత మోడీ సర్కారు సొంతమని సటైర్ వేశారు. తమ గళాన్ని వినిపించడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు ఖర్గే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జనవరి 14న ప్రారంభంకానున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ మార్చి 30న ముగుస్తుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 66 రోజుల పాటు దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లోనే సాగుతుందని, మధ్యమధ్యలో పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. 2022లో రాహుల్‌ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల్లో 136 రోజుల పాటు దాదాపు 4,500 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర చేపట్టారు.

Updated : 6 Jan 2024 11:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top