కాంగ్రెస్ కొత్త సీడబ్యూసీ ఇదే.. తెలంగాణ నుంచి నో..
X
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలే గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇంటిని సరిదిద్దుకుంటోంది. జాతీయ స్థాయి కొత్త కార్యవర్గాన్ని(సీడబ్ల్యూసీ) ఏర్పాటు చేసింది. పలువురు సీనియర్ నేతలకు చోటు కల్పించింది. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కమిటీ వివరాలను ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న శశిథూర్, సచిన్ పైలట్ సహా పలువురికి చోటు దక్కింది.
39 మందితో కూడిన కొత్త వర్కింగ్ కమిటీలో ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డికి చోటు కల్పించారు. తెలంగాణను నుంచి ఎవరినీ తీసుకోలేదు. టీపీపీసీ రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేసే కూర్పే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ వంటి హేమీహామీలు యథావిధిగా ఉన్నారు. 18 మందిని శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించారు. వీరిలో సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డి, కొప్పుల రాజు, దామోదర్ రాజనర్సింహ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పల్లం రాజు, చల్లా వంశీచందర్ రెడ్డి ఉన్నారు.
The Congress President Shri @kharge has constituted the Congress Working Committee.
Here is the list: pic.twitter.com/dwPdbtxvY5
— Congress (@INCIndia) August 20, 2023