Home > జాతీయం > జీ20 ఖర్చులపై వివాదం..కేంద్రం క్లారిటీ ఇది

జీ20 ఖర్చులపై వివాదం..కేంద్రం క్లారిటీ ఇది

జీ20 ఖర్చులపై వివాదం..కేంద్రం క్లారిటీ ఇది
X

భారత్ అధ్యక్షతన జరిగిన జీ 20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు కేంద్రం అనుకున్నదానికన్నా అధికంగా ఖర్చు చేసిందనే వివమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విమర్శలపై కేంద్రం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఖండించింది.

జీ 20 సదస్సు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 300 శాతం అదనంగా ఖర్చు చేసిందని తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం అలర్ట్ అయ్యింది. "ఈ ఆరోపణల్లో నిజం లేదు. ఆ వ్యయంలో ఎక్కువ శాతాన్ని ఐటీబీపీ వంటి సుదీర్ఘకాలం సేవలు అందించే ఆస్తుల కోసం కేటాయించాం. ఆ నిర్మాణాలు కేవలం ఒక్క జీ20 సదస్సుకే పరిమితం కావు. జీ20 సదస్సు కోసం కేంద్ర సర్కార్ బడ్జెట్‌లో రూ.990 కోట్లు కేటాయించింది. కానీ రూ.4100 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇంత మొత్తం బడ్జెట్ ఎక్కడికి వెళ్లిపోయిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. మోదీ పర్సనల్ పబ్లిసిటీ కోసం సర్కార్ ఈ ఖర్చు చేసిందని.. ఈ ఖర్చులను బీజేపీ ఎందుకు చెల్లించకూడదని టీఎంసీ ప్రశ్నించింది.

Updated : 12 Sep 2023 8:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top