పేరు మార్చుకున్న దేశాలివే.. కారణం ఏంటో తెలుసా?
X
ఇండియా పేరును భారత్ గా పేరు మార్చుతున్నారని దేశం మొత్తం చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశం పేరు భారత్ గా మార్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఒక దేశం పేరు మారడం ఇదేం కొత్త కాదు. చరిత్రలో చాలాసార్లు, చాలా దేశాల పేర్లు మారాయి. స్వాతంత్ర్యం, రాజకీయం, సాంస్కృతిక, సామాజిక అంశాల ప్రభావంతో ఈ మార్పులు జరిగినట్లు చరిత్ర చెప్తోంది. దేశం పేరు మార్పు అనేది దాని గుర్తింపు, సార్వభౌమాధికారం లేదా చారిత్రక కథనంలో మార్పును సూచిస్తుంది. అయితే ఇప్పటివరకు ఏడు దేశాల పేర్లు మారాయి. అవేంటంటే..?
రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా టు నార్త్ మాసిడోనియా:
2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును నార్త్ మాసిడోనియాగా మార్చారు. గ్రీస్ తో చాలాకాలంగా ఉన్న వివాదాన్ని ఈ మార్పు పరిష్కరించింది.
జైర్ టు ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో:
అనేక రాజకీయ తిరుగుబాట్లు, వివాదాల తర్వాత జైర్ దేశం పేరును ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోగా 1997లో మార్చారు. మూడు దశాబ్దాలకు పైగా నియంతగా పాలించిన మొబుటు సేసే సెకో పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలపా వ్యవస్థ ఈ పేరు మార్పుతో తిరిగొచ్చింది.
చెకోస్లోవాకియా టు చెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియా:
1993లో చెకోస్లోవాకియా పేరును చెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియాగా మార్చారు. చెక్ రిపబ్లిక్ ఒక దేశంగా స్లోవేకియా మరో దేశంగా ఏర్పాటయ్యాయి. ఈ శాంతియుత విభజన కమ్యూనిస్ట్ పాలనను అనుకరించింది.
బర్మా టు మయన్మార్:
1989లో పాలక మిలిటరీ జుంటా బర్మా దేశం పేరును మయన్మార్‌గా మార్చేశారు.
సిలోన్ టు శ్రీలంక:
1972లో సిలోన్ ద్వీప పేరును శ్రీలంకగా మార్చారు. ఈ పదం సింహళ భాషలో పాతుకుపోయి రిపబ్లిక్ గా ప్రకటించబడింది. శ్రీలంక అంటే సింహాళీ భాషలో ప్రకాశవంతమైన భూమి అని అర్థం
ఈస్ట్ పాకిస్తాన్ టు బంగ్లాదేశ్:
1971లో జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత పాకిస్తాన్ నుంచి వేరు పడిన ఈస్ట్ పాకిస్తాన్.. తన దేశాన్ని బంగ్లాదేశ్ గా ప్రకటించుకుంది.
సియామ్ టు థాయ్ లాండ్:
థాయిలాండ్ అంటే స్వేచ్ఛా భూమి. 1939లో సియామ్ పేరును థాయిలాండ్ గా మార్చారు.