Home > జాతీయం > రాఖీ పండుగ ఎఫెక్ట్.. కూతురి కోసం ఎంత పనిచేశారంటే..?

రాఖీ పండుగ ఎఫెక్ట్.. కూతురి కోసం ఎంత పనిచేశారంటే..?

రాఖీ పండుగ ఎఫెక్ట్.. కూతురి కోసం ఎంత పనిచేశారంటే..?
X

అన్నా - చెల్లి, అక్కా - తమ్ముడి అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పండుగా వస్తుందంటే చాలు.. అక్కాచెల్లెల సందడి మామూలుగా ఉండదు. ఓ బాలిక కూడా సోదరుడికి రాఖీ కట్టాలని అనుకుంది. అయితే అప్పటికే ఆమె అన్నయ్య చనిపోయాడు. అయినా ఆ బాలిక తనకో తమ్ముడు కావాలని.. అతడికి రాఖీ కడతానని పట్టుబట్టింది. దీంతో కూతురు కోరిక తీర్చేందుకు తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. నెల రోజుల మగశిశివుని కిడ్నాప్ చేశారు. చివరకు పోలీసులకు చిక్క కటకటాలపాలయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

సంజయ్‌ గుప్త - అనిత గుప్త దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 17 ఏళ్ల కొడుకు గతేడాది ప్రమాదవశాత్తు మరణించాడు. అన్నయ్య లేకపోవడానికి ఆ బాలిక తట్టుకోలేకపోయింది. ప్రతిఏడాదీ అన్నయ్యకు రాఖీ కట్టినట్లుగానే ఈ ఏడాది కూడా రాఖీ కట్టాలనుకుంది. దానికి తనకు ఓ తమ్ముడు కావాలని తల్లిదండ్రులను కోరింది. ఆ బాలిక కోరిక తీర్చేందుకు ఓ మగపిల్లాడిని కిడ్నాప్‌ చేయాలని ఆ పేరెంట్స్ నిర్ణయించుకున్నారు.

ఛట్టా రైల్వే ఫుట్ పాత్పై నిరుపేద దంపతులు నెల వయస్సున్న కొడుకుతో నిద్రిస్తున్నారు. గురువారం రాత్రి అక్కడికి వెళ్లిన సంజయ్ - అనిత ఆ మగశిశివును ఎత్తుకెళ్లిపోయారు. తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి వారి కొడుకు కన్పించలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దాదాపు 400 సీసీ కెమెరాలు పరిశీలించి.. ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరగడాన్ని గుర్తించారు.

బైక్ నంబర్ ఆధారంగా సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు శిశివును అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. తమ కూతురి కోరిక తీర్చేందుకే కిడ్నాప్ చేసినట్లు వారు చెప్పారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సంజయ్పై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated : 26 Aug 2023 10:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top