సోషల్ మీడియాలో ఫస్ట్‌నైట్ వీడియోను షేర్ చేసిన జంట
X
పెళ్ళి అనేది అసలైన జీవన పయనానికి ముఖద్వారం. ప్రతి మనిషి జీవితంలో మరచిపోలేని మధురమైన జ్ఞాపకం. ఇక ఆ తర్వాత జరిగే మెుదటి రాత్రి కోటి ఆశల సమాహారానికి.. రెండు మనసులు ఏకమై ఏకాంతంలో చర్చించుకోనే ఘట్టం.
మెుదటి రాత్రి అనేది భార్యాభర్తలు మధ్య ఉండాల్సిన రహస్య తతంగం. కానీ ఓ కొత్త జంట మెుదటి రాత్రి కార్యాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో, కొత్తగా పెళ్లైన జంట ఫస్ట్ నైట్‌కి సిద్ధమవుతున్న ట్లు కనిపిస్తోంది. వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి ఉండగా.. అబ్బాయి షేర్వాణిలో కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకుంటారు. తర్వాత వధువు తన ఆభరణాలను తీసివేయడం ప్రారంభిస్తుంది. అబ్బాయి (వరుడు) ఆమెను వెనుక నుండి ముద్దు పెట్టుకుంటాడు. దీన్ని ఎక్స్(X)లో @Toxicity__ అనే ఖాతాలో షేర్ చేశారు. వైరల్ మారిన ఈ వీడియోను 2 లక్షల మందికి పైగా వీక్షించారు.. ఇక వీడియోపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Puri Unboxing post karna tha 🤐 pic.twitter.com/i40KupAEwk
— Berlin (@Toxicity_______) November 27, 2023