ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ కోర్టు సమన్లు
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరీంగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు పంపింది. మార్చి16న ఆయన విచారణకు హాజరు కావాలని ఢిల్లీలోని అవెన్యూ కోర్టు తాజాగా తాఖీదులు జారీ చేసింది. ఆయనకు పలుమార్ల సమన్ల ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కావడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. గత నాలుగు నెలల్లో సుమారు ఎనిమిదిసార్లు ఈడీ అధికారులు ఆప్ సుప్రిమోకు సమన్లు పంపారు. మద్యం కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది.
ఈ అంశంపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున విచారణకు హాజరుకాలేనని తెలిపారు. మార్చి 12 తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమేనని చెప్పారు. విచారణకు ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.