Home > జాతీయం > దారుణం.. గోమాంసం తీసుకెళ్తున్నారని కొట్టిచంపిన గోరక్షకులు

దారుణం.. గోమాంసం తీసుకెళ్తున్నారని కొట్టిచంపిన గోరక్షకులు

దారుణం.. గోమాంసం తీసుకెళ్తున్నారని కొట్టిచంపిన గోరక్షకులు
X

కారులో గోమాంసం తీసుకెళ్తున్నారంటూ ఇద్దరు మైనారిటీలపై గోరక్షకులు దారుణంగా దాడి చేశారు. ఒకరు చనిపోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం ఆ దారుణం జరిగింది. సిన్నర్ ఘోటీ హైవేపై ముంబైకి వెళ్తున్న కారును గోరక్షులు అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో మాంసం కనిపించడంతో గోవు మాంసమేనంటూ దాడి చేశారు. కారులోని అఫాన్ అబ్దుల్ మజీద్ అన్సారీ, నాసిర్ షేక్‌లను కిందికి దిగమని చెప్పి 15 మంది ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టి వెళ్లిపోయారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా అబ్దుల్ మజీద్ చికిత్స పొందుతూ చనిపోయాడు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు కారును కూడా ధ్వంసం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాసిక్ రూరల్ డిప్యూటీ ఎస్పీ సునీల్ భంరే చెప్పారు. ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశామన్నారు.


Updated : 27 Jun 2023 9:02 AM IST
Tags:    
Next Story
Share it
Top