Home > జాతీయం > Amit Malviya : సాధువులను బట్టలు విప్పి కొట్టిన మూక.. బీజేపీ గరం

Amit Malviya : సాధువులను బట్టలు విప్పి కొట్టిన మూక.. బీజేపీ గరం

Amit Malviya : సాధువులను బట్టలు విప్పి కొట్టిన మూక.. బీజేపీ గరం
X

పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సాదువులపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ నేత అమిత్ మాల్వియా దాడికి సంబంధించిన వీడియాను Xలో పోస్ట్ చేస్తూ మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2020లో జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ మాబ్ లించింగ్తో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మమతా బెనర్జీ మౌనంగా ఉన్నందుకు సిగ్గుపడాలి. ఈ సాదువులంటే విలువ లేదా? ఈ దారుణానికి సమాధానాలు కావాలి" అంటూ విమర్శించారు. "పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మకర సంక్రాంతికి గంగాసాగర్కు వెళ్తున్న సాదువుల గుంపును అధికార టిఎంసికి చెందిన గుండాలు బట్టలు విప్పి కొట్టారంటూ" అమిత్ మాల్వియా విమర్శించారు పశ్చిమ బెంగాల్లో హిందువుగా ఉండటం నేరమా? మమతా ప్రభుత్వాన్ని మాల్వియా సూటిగా ప్రశ్నించారు.'మమతా బెనర్జీ పాలనలో షాజహాన్ షేక్ వంటి ఉగ్రవాదులకు ప్రభుత్వం భద్రత కల్పించింది. కాని సాదువులు మాత్రం చంపబడుతున్నారని" అన్నారు

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కూడా ఈ ఘటనపై మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. పురూలియాలో జరిగింది దారుణమైన సంఘటన. గంగాసాగర్ వైపు వెళుతున్న సాదువులను కొందరు నేరగాళ్లు కొట్టారు. ఇది పాల్ఘర్లో జరిగిన సంఘటనను గుర్తుచేస్తుంది. పశ్చిమ బెంగాల్లో హిందువుగా ఉండటం నేరమా? అంటూ విమర్శించారు. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ సంఘటనను ఆయన x పోస్ట్ ద్వారా ఖండించారు. అయితే ఈ వివాదంపై టీఎంసీ ఇంతవరకు స్పందించలేదు.

అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా వివరణను ఇచ్చారు. గంగా సాగర్కు వెళుతున్న సాదువులను చూసిన కొందరు స్థానికులు పిల్లలను ఎత్తుకెళ్లేవారిని భావించి కొట్టినట్లు తెలిపారు. దారి గురించి ఇద్దరు మైనర్ బాలికలను సాదువులను అడిగినప్పుడు.. వాళ్లు భయపడి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ సాదువులను పట్టుకొని కొట్టినట్లు వెల్లడించారు.

Updated : 13 Jan 2024 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top