Home > జాతీయం > 3 క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు లోక్ సభ ఆమోదం

3 క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు లోక్ సభ ఆమోదం

3 క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు లోక్ సభ ఆమోదం
X

క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బ్రిటీష్‌ కాలం నుంచి అమల్లో భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), సాక్ష్యాధార చట్టం (Evidence Act) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూజువాణి ఓటింగ్‌ తో ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది.

ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భరతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) భారతీయ సాక్ష్య (బీఎస్) పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లులను సభ ముందుంచారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో శీతాకాల సమావేశాల్లో వాటిని వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత వాటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య' బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి.

Updated : 20 Dec 2023 1:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top