విరుచుకుపడనున్న బిపర్‌జోయ్..8 రాష్ట్రాలపై భారీ ఎఫెక్ట్
X
బిపర్‌జోయ్ తుపాను అత్యంత భయానకంగా మారనుంది. తీరం దాటక ముందే తుపాను విరుచుకుపడుతోంది. తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని తీర తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రాంతాల్లోని 74వేల మందికిపైగా స్థానికులను సురక్షిత స్థావరాలకు తరలించారు. కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టిగా వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ హై అలర్ట్‌ను ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్ జిల్లాల్లో 50 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఏకంగా 121 మి.మీ.ల వర్షం కురిసింది. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తుపాను దిశను మార్చుకుని ఈశాన్యవైపుగా కదులుతూ కఛ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో గురువారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో తుపాను అత్యంత బీభత్సాన్ని సృష్టించనుందని హెచ్చరించింది.
తపాను ప్రభావం గుజరాత్‌పై అధికంగా కనిపిస్తోంది. ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బిపర్‌జోయ్ తుపాను విలయతాండవం చేస్తుందని ఊహించని రీతిలో దాని ఉనిక ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను ఎదుర్కొనేందుకు వీలుగా త్రివిధ దళాలు అన్ని రకాల సహాయక కార్యక్రమాలకు రెడీ గా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆదేశాలు జారీ చేశారు.
బిపర్‌జోయ్ తుపాను ప్రసత్ుతం కచ్ తీరానికి 290 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 18 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు , 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 టీమ్‌లు , విద్యుత్ శాఖకు చెందిన దాదాపు 400 బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తీరానికి దూరంగా ఉన్న స్కూల్స్, ఆఫీసులను సహాయక శిబిరాలుగా మార్చారు. ప్రజలకు అవసరమయ్యే ఆహారం, తాగునీరు, వైద్య సేవలను అందిస్తున్నారు.
బిపర్‌జోయ్ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఇవాళ పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. విశాఖ నుంచి వెళ్లే ధిఘా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అదే విధంగా షాలిమార్ నుంచి హైదరాబాద్ వచ్చే ఈస్ట్ కోస్టు రైలును క్యాన్సెల్ చేశారు. శుక్రవారం రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. ప్రశాంతి నిలయం - హావ్ డా ఎక్స్ప్రెస్‌లను రైళ్లైను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.