Home > జాతీయం > బిపర్‌జోయ్ బీభత్సం.. గుజరాత్‌లో భీకర గాలులు

బిపర్‌జోయ్ బీభత్సం.. గుజరాత్‌లో భీకర గాలులు

బిపర్‌జోయ్ బీభత్సం.. గుజరాత్‌లో భీకర గాలులు
X

బిప‌ర్‌జాయ్ తుఫాన్ (Biporjoy Cyclone) గురువారం రాత్రి గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లా జ‌ఖౌ పోర్ట్ (jakhau Port) వ‌ద్ద తీరం దాటింది. . గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో విధ్వంసం సృష్టిస్తోంది.





తుఫాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. . 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు రోడ్లు,భవనాల శాఖకు చెందిన 115 బృంధాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 99 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది.

ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో వరదల కారణంగా లోయలో చిక్కుకున్న తమ మేకలను రక్షించేందుకు యత్నించిన తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రామ్‌జీ పర్మార్, అతడి కుమారుడు రాకేష్ పర్మార్‌గా గుర్తించారు. మేకలు కూడా లోయలో కొట్టుకుపోయి మృతిచెందాయి. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సిహోర్ పట్టణానికి సమీపంలోని భండార్ గ్రామం గుండా వెళుతున్న లోయలో నీరు ప్రవహించడం ప్రారంభమైందని మమ్లత్దార్ (రెవెన్యూ అధికారి) ఎస్ఎన్ వాలా తెలిపారు.






Updated : 16 Jun 2023 5:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top