Home > జాతీయం > తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌..గుజరాత్ అతలాకుతలం

తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌..గుజరాత్ అతలాకుతలం

తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌..గుజరాత్ అతలాకుతలం
X

బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. గురువారం సాయంత్రం బిపోర్‌జాయ్‌ తీరాన్ని తాకడంతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీంతో భీకర గాలులు భయపెడుతున్నాయి. కుండపోత వర్షం కురుస్తోంది. ప్రస్తుతం గంటకు 100కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120కి.మీ నుంచి 130కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. తుపాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే 20 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంచారు. ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు రోడ్లుభవనాలశాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్‌శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ దళాలను కూడా రంగంలోకి దించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమ రైల్వే ఇప్పటివరకు 76 రైళ్లను రద్దు చేసింది.

Updated : 15 Jun 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top