Home > జాతీయం > IMD : తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాల్లో వర్షాలు

IMD : తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాల్లో వర్షాలు

IMD : తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాల్లో వర్షాలు
X

వాయవ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘హమూన్’ (Cyclone Hamoon) తీవ్ర తుపానుగా మారినట్టు భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. అక్టోబర్ 24వ తేదీ ఉదయం ఆరు గంటల సమయానికి ఉత్తర ఈశాన్య దిశగా.. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 25వ తేదీ సాయంత్రానికి తుఫాన్ హమూన్.. బంగ్లాదేశ్ దేశంలోని చిట్టగాంగ్ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసం జరగొచ్చని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు సముద్రానికి దగ్గరలో ఉండే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్స్ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ తుపాను ఈశాన్యం దిశగా కదలడం ప్రారంభమైందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌ కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌ లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది.

హమూస్.. మన దేశం నుంచి వెళ్లిపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అల్పపీడనం సమయంలో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తుఫాన్ ఉండొచ్చు అని భావించినా.. అలాంటిది ఏమీ లేకుండా.. బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవటంతో పెద్ద గండం తప్పింది.



Updated : 24 Oct 2023 6:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top