Home > జాతీయం > భారత్కు తప్పిన హమూన్ గండం.. రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం

భారత్కు తప్పిన హమూన్ గండం.. రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం

భారత్కు తప్పిన హమూన్ గండం.. రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం
X

బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 6 గంటల్లో అది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ అక్టోబర్ 25 సాయంత్రం బంగ్లాదేశ్ లోని ఖేపుపారా, చిట్టగాంగ్ వద్ద తీరం దాటే అవకాశముందని అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావంతో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తీరం దాటే సమయంలో వేగం 180 కిలోమీటర్లకు చేరుతుందని హెచ్చరించారు.

హమూన్ తుఫాన్ ప్రభావం భారతదేశంపైనా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ ఏడు రాష్ట్రాల్లో 24, 25, 26 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో బంగాళాఖాతంలోకి మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. రెండు రోజుల వరకు ఇవే హెచ్చరికలు కొనసాగుతాయని చెప్పింది.

హమూన్ అతి తీవ్ర తుఫాన్ గా మారటంతో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసం జరగొచ్చని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రానికి దగ్గరలో ఉండే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.




Updated : 24 Oct 2023 3:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top